ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లక్షల్లో భక్తులు; ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు
బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షల్లో భక్తులు తరలివస్తారని అంచనా. భక్తుల ఆరోగ్య భద్రత కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
DMHO హైదరాబాద్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆలయం చుట్టూ ఐదు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు అడ్వాన్స్డ్ సపోర్టు, రెండు బేసిక్ అంబులెన్స్లు, అత్యవసర మందులతో పాటు కార్డియాలజిస్ట్, ఫిజీషియన్, గైనకాలజిస్ట్ తదితర నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు.
డాక్టర్ మౌనికా పాత్రు వివరాల ప్రకారం, పోలీస్ స్టేషన్, రామగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్, బాట రోడ్డు, అంజలి థియేటర్, ఆలయం లోపల ఇలా ఐదు చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టాము. ప్రతి క్యాంపులో ఐదుగురు డాక్టర్లు, సిబ్బందితో పాటు బ్యాకప్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
గత ఏడాది బోనాల రద్దీ సమయంలో ఫిట్స్ కేసులు, తొక్కిసలాట లాంటి ఘటనలు ఎదురయ్యాయని వారు గుర్తు చేశారు. ఈసారి మరింత దృఢమైన ఏర్పాట్లు చేసామని, చిన్న గాయాల నుంచి పెద్ద గాయాల వరకు చికిత్స చేయడానికి సన్నద్ధంగా ఉన్నామని వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని ఆస్పత్రులకు రిఫర్ చేస్తామని, అగ్నిమాపక శాఖ, పోలీసులు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటామని అధికారులు వెల్లడించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com