ఎమర్జెన్సీ నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది: వెంకయ్య నాయుడు
1975-77 నాటి ఎమర్జెన్సీ కాలం తనను రాజకీయాల వైపు నడిపించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించడం ద్వారా తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. లేకపోతే న్యాయవాదిగానే కొనసాగేవాడినని అన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో కాకతీయ సేవా సమితి నిర్మించిన కళ్యాణ మండపాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు జాతిని ఐక్యపరిచారని, ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నేటికీ అమలవుతున్నాయని అన్నారు. కమ్మ కులస్తులు సమైక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com