విశాఖ విమానాశ్రయం నుంచి చివరి వాణిజ్య విమానం; పౌర సేవలు ముగింపు
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి చివరి షెడ్యూల్డ్ వాణిజ్య విమానం నిన్న రాత్రి 10:30కి ఢిల్లీకి బయలుదేరింది. దీంతో విశాఖలో నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగిన పౌర విమాన సేవల చరిత్ర ముగిసింది.
ఇకపై ఈ విమానాశ్రయాన్ని అత్యవసర, సైనిక ప్రత్యేక విమానాలకు మాత్రమే వాడుతారు. ప్రస్తుతం విమానాశ్రయం ఆవరణ, పరిసర ప్రాంతాలు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం అయిన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం మూసివేశారు.
ఉపాధి కోల్పోయామని అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా పని చేసిన తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని వారు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com