శ్రావణమాసంలో మాంసాహారం తినకూడదని చెప్పడానికి సైంటిఫిక్ కారణాలు ఇవే
శ్రావణమాసంలో మాంసాహారం తినకూడదని చాలా ఇళ్లలో పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది కేవలం సంప్రదాయం, భక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆ నియమం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
నిజానికి శ్రావణమాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది, మన జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. చికెన్, మటన్ వంటి మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వెంటనే అరగని మాంసం కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
వర్షాకాలంలో నీరు కలుషితం అవుతుంది. రొయ్యలు, చేపలు వంటి సీఫుడ్లో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇంకా తేమ ఎక్కువగా ఉండటం వల్ల మాంసంలో ఫంగస్, బ్యాక్టీరియా త్వరగా పెరిగి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.
అంతేకాకుండా వర్షాకాలం చేపల సంతానోత్పత్తి సమయం. అందుకే మన పెద్దలు ఈ సీజన్లో చేపలు పడొద్దని, తినొద్దని సూచించారు. దీనివల్ల చేపల జాతి క్షీణించకుండా ఉంటుందని వారి భావన.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com