హైదరాబాద్ 30°C
అమరావతి 32°C
IST 9:54 AM
గురువారం జూలై 16 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

పెండింగ్ నిధులు, ప్రత్యేక ప్యాకేజీ విడుదల కోసం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన అడ్లూరి లక్ష్మణ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పెండింగ్ నిధులు, ప్రత్యేక ప్యాకేజీ విడుదల కోసం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన అడ్లూరి లక్ష్మణ్
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

ప్రజాప్రతినిధి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామదాస్ అతవాలేను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ఒక వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా, ఎస్సీ విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, విద్యా సంస్థల ఆధునీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కోసం అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రూ.150 కోట్ల నిధులు విడుదల చేయాలనీ, అదనంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద రూ.300 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ కులాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై వచ్చే నెలలో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com