అల్లు అర్జున్ పారిస్‌లో వేసవి సెలవులు — 'రాకా' షెడ్యూల్ వచ్చే నెలలో
నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి పారిస్‌లో వేసవి సెలవులు గడుపుతున్నారు. రాకా చిత్రీకరణతో బిజీగా ఉన్న ఆయన విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్లారని సమాచారం.
వచ్చే నెల ప్రారంభంలో అల్లు అర్జున్ ఇండియా తిరిగొస్తారు. ఆ తర్వాత వెంటనే ముంబైలో రాకా చిత్రం కీలక షెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్‌లో సినిమా ముఖ్య తారాగణం అందరూ పాల్గొంటారని సమాచారం.
ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తున్నారు. రష్మిక మందన, జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని వినిపిస్తోంది. దర్శకుడు అట్లీ, నిర్మాతలు Sun Pictures ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
రాకా చిత్రాన్ని 2026 second half లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com