ఏపీలో తీవ్ర వేడిమి: 47.2°C నమోదు, పలు జిల్లాలకు Red Alert
ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. నిన్న 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. AP విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏలూరు, కృష్ణ, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలలో 42 నుంచి 44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 40 నుంచి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com