AP SIR గడువు పొడిగింపు: CEO వివేక్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. AP లో నెల రోజులుగా కొనసాగుతున్న SIR గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి AP ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ లేఖ రాశారు. వివిధ రాజకీయ పార్టీలతో పాటు కొన్ని అర్బన్ జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
AP లో ఇప్పటి వరకు 88% SIR ప్రక్రియ పూర్తయిందని CEO వివేక్ వెల్లడించారు. మొత్తం 4 కోట్ల 16 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా, ఇప్పటి వరకు 3 కోట్ల 69 లక్షల మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. ఇంకా 9% కి పైగా ప్రక్రియ పూర్తి కావలసి ఉండడంతో గడువు పొడిగించాలని EC ని కోరినట్టు CEO వివేక్ తెలిపారు.
సర్వేలో భాగంగా ఇప్పటి వరకు AP వ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా ఓటర్లు మరణించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే BLO లు ఇళ్లకు వెళ్ళగా 7 లక్షల మందికి పైగా ఓటర్లు అందుబాటులోకి రాలేదని, మరో 12 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్టు తేలింది. ఇంకా 1.67% ఎన్యుమరేషన్ ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి.
వాస్తవానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేటితో ముగియనుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో SIR ప్రక్రియ గడువు పొడిగించాలంటూ CEO వివేక్ EC కి లేఖ రాశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com