అరుదైన SMA Type 1 వ్యాధితో ఆరు నెలల శిశువు — తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నపం
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన ఆరు నెలల శిశువు మొయిష SMA Type 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ శిశువు 2025 డిసెంబర్ 11న జన్మించింది. పుట్టిన రెండు నెలల తర్వాత కాళ్లు, చేతులు కదపలేకపోతోంది. మెడ నిలబడట్లేదు.
తల్లిదండ్రులు ముందుగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి hospital కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి NIMS hospital కి refer చేశారు. genetic test చేయించగా SMA Type 1 వ్యాధి నిర్ధారణ అయింది. భారతదేశంలో ఈ వ్యాధికి పూర్తి చికిత్స అందుబాటులో లేదని వైద్యులు తెలిపారు. విదేశాల నుంచి తెప్పించే injection మాత్రమే శిశువు ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని చెప్పారు. ఆ injection ధర ₹16 కోట్లు.
వైద్యులు Risdiplam అనే syrup ఇప్పటికి ఇచ్చారు. అయితే దానివల్ల పూర్తిగా నయమవుతుందని guarantee లేదని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు తమ మొదటి బిడ్డను కూడా ఇదే వ్యాధితో కోల్పోయారు. ఇప్పుడు రెండో బిడ్డకు అదే వ్యాధి వచ్చినందుకు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డను కాపాడాలని AP CM చంద్రబాబు నాయుడు, Deputy CM పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, స్థానిక MLA కొండపల్లి శ్రీనివాస రావులకు విన్నపం చేసుకుంటున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com