హైదరాబాద్ 27°C
అమరావతి 34°C
IST 4:07 PM
శనివారం జూలై 18 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వార్తలు

విక్రమ్ వన్ ప్రయోగంలో బిగ్ ట్విస్ట్: చివరి నిమిషంలో కౌంట్‌డౌన్ నిలిపివేత

రచన: ఉషా కిరణం డెస్క్ ·
విక్రమ్ వన్ ప్రయోగంలో బిగ్ ట్విస్ట్: చివరి నిమిషంలో కౌంట్‌డౌన్ నిలిపివేత
📷 Esra Afşar / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ చేపట్టిన విక్రమ్ వన్ రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుండి మిషన్ ఆగమన్ పేరుతో ఈ ప్రయోగం జరగనుండగా, ఉదయం 5:00 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై సుమారు ఆరు గంటల తర్వాత 11:30 కి లాంచ్ జరగాల్సి ఉంది. అయితే చివరి మూడు నిమిషాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కౌంట్‌డౌన్ ఆపేయడం జరిగింది.

ఈ రాకెట్ ప్రయోగం భారతదేశంలో మొదటిసారిగా పూర్తిగా ప్రైవేట్ సంస్థ చేపట్టిన ప్రయత్నం కావడం విశేషం. విక్రమ్ సారాభాయి పేరిట నామకరణం చేయబడిన ఈ రాకెట్ నాలుగు దశల్లో పనిచేయనుంది. తొలి మూడు దశలు ఘన ఇంధనంతో పనిచేయగా, చివరి దశలో ద్రవ యంత్రం ఉపయోగించబడుతుంది. మొదటి దశలో 1000 కిలోల పేలోడ్, రెండో దశలో 250 కిలోలు, మూడో దశలో 100 కిలోల పేలోడ్ సామర్థ్యం ఉంటుంది.

రిటైర్డ్ సైంటిస్ట్ అశోక చక్రవర్తి మాట్లాడుతూ, కౌంట్‌డౌన్ ఆగిపోవడం శుభ పరిణామమేనని తెలిపారు. లాంచ్ అయిన తర్వాత వైఫల్యం చెందేకంటే ముందే సాఫ్ట్‌వేర్ సిస్టమ్ లోపాన్ని గుర్తించడం ప్రైవేట్ సంస్థ నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. 3D ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఇంజన్ పార్ట్స్ మరియు AI మోడల్‌తో అనుసంధానమైన సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఈ రాకెట్ ప్రత్యేకతలు అని వివరించారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచ పటంలో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి మంచి పేరు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో 90 శాతానికి పైగా ఎలన్ మస్క్ స్పేస్ X ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో, భారత ప్రైవేట్ సంస్థ రంగ ప్రవేశం చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

మరోవైపు ISRO సైంటిస్ట్‌లు వరుసగా రాజీనామాలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ రంగంలో అధిక జీతాలు మరియు మంచి అవకాశాలు లభించడంతో వందలాది మంది ISRO శాస్త్రవేత్తలు రాజీనామాలు చేస్తున్నారు. దీంతో కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి ఈ రాజీనామాలను ఆమోదించవద్దని ఆదేశాలు జారీ చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com