హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 8:15 PM
గురువారం ఆగస్టు 6 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

బ్రెయిన్ స్ట్రోక్: కారణాలు, లక్షణాలు మరియు అత్యాధునిక చికిత్సా విధానాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బ్రెయిన్ స్ట్రోక్: కారణాలు, లక్షణాలు మరియు అత్యాధునిక చికిత్సా విధానాలు
📷 Leandro Paes Leme / Pexels
షేర్ కాపీ అయింది ✓

యశోదా హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జి రాజశేఖర్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ గురించి ముఖ్యమైన వివరాలను తెలియజేశారు.

మెదడుకు రక్త ప్రవాహం తగ్గడం లేక రక్తనాళం చిరిగి బ్లీడింగ్ కావడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ఆయన వివరించారు. ఈ స్ట్రోక్ కు డయాబెటిస్, హైపర్టెన్షన్ ప్రధాన కారణాలు. సరైన ఆహారం లేకపోవడం, నూనె వంటకాలు ఎక్కువ తినడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.

స్ట్రోక్ లక్షణాలు: - నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం, తడబడడం. - మాట మారడం, స్పష్టత లేకుండా మాట్లాడడం, పూర్తిగా మాట ఆగిపోవడం. - ఒకవైపు చూపు తగ్గడం లేక సగం కనిపించకపోవడం. - చెయి, కాలు బలహీనత లేక స్పర్శ తగ్గిపోవడం. - సడన్ గా స్పృహ తప్పి పడిపోవడం, తలతిరగడం.

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నియరెస్ట్ హాస్పిటల్ కు వెళ్లాలి. ఇంటి వద్ద ఎలాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయకూడదు. స్పృహ లేకపోతే ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు.

మెదడు చాలా సున్నితమైన టిష్యూ. రక్తం సరఫరా తగ్గితే కొన్ని నిమిషాల్లోనే మిలియన్ల కణాలు చనిపోతాయి. ఎంత త్వరగా హాస్పిటల్ కు రీచ్ అయితే, అంత మెరుగైన రికవరీ అవుతుంది. దీనిని “గోల్డెన్ అవర్” అంటారు.

ఇస్కిమిక్ స్ట్రోక్ లో రక్తం గొట్టం బ్లాక్ అవుతుంది. హెమరేజిక్ స్ట్రోక్ లో రక్తం గొట్టం పగిలి బ్లీడింగ్ అవుతుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ కు 4.5 గంటల లోపు క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ (ఆల్టేప్లేస్ వంటివి) ఇస్తారు. ఆ తర్వాత వచ్చే కొన్ని కేసుల్లో మెకానికల్ థ్రంబెక్టమీ అనే ప్రక్రియతో 6 నుంచి 24 గంటల లోపు రక్తం గడ్డను తొలగిస్తారు. హెమరేజిక్ స్ట్రోక్ కి బ్లీడింగ్ సైజ్ బట్టి మందులతో లేక సర్జరీతో చికిత్స చేస్తారు.

స్ట్రోక్ తర్వాత పూర్తి కోలుకునే అవకాశం ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది, చికిత్స ఎప్పుడు మొదలయింది, రోగి వయసు, ఇతర వ్యాధులపై ఆధారపడి ఉంటుంది. స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ ద్వారా రికవరీ స్పీడ్ అవుతుంది. స్ట్రోక్ వచ్చిన వారు జీవితకాలం మెడిసిన్స్ వాడాలి. బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మళ్ళీ స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. ఇటీవలికాలంలో 40 ఏళ్ల లోపు యువతలో కూడా స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com