చిత్తూరు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్; 181.5 గ్రా. బంగారం, 307 గ్రా. వెండి స్వాధీనం
చిత్తూరు జిల్లాలో ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బంగారుపాలెం, పలమనేరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులు తమిళనాడుకు చెందిన గాడ్విన్, మోసిన్ ఎస్, మురుగన్, విగ్నేష్‌లుగా గుర్తించారు. వీరి నుంచి 181.5 గ్రాముల బంగారం, 307 గ్రాముల వెండి, కారు, స్కూటీతో పాటు మొత్తం రూ.27,80,000 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై ఆంధ్రప్రదేశ్‌లో ఆరు కేసులు (పలమనేరు పట్టణం, బంగారుపాలెం పోలీస్ స్టేషన్లలో మూడేసి చొప్పున), తమిళనాడులో మరో ఆరు కేసులు నమోదయ్యాయి. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు పంపారు.
ఈ కేసును త్వరగా చేధించిన బంగారుపాలెం పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com