హైదరాబాద్ 32°C
అమరావతి 35°C
IST 12:53 PM
మంగళవారం సెప్టెంబర్ 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక బ్యూరో ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక బ్యూరో ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ ట్రాఫిక్, రోడ్డు భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూర్తి అధ్యయనంతో ఆ బ్యూరోను సంస్థాగతంగా నిర్మించాలని, ప్రతి రెండు మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు.

ట్రాఫిక్ విషయంలో కేవలం నిబంధనలపై కాకుండా క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, పండుగలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని వివరించారు.

ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ప్రమాదాలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ తీసుకురావడానికి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com