SIR పూర్తయ్యే వరకు గాంధీ భవన్‌కు నేతలు రావద్దు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR) పూర్తయ్యే వరకు పార్టీ నేతలు ఎవరూ గాంధీ భవన్‌కు రావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 3 వరకు ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వవద్దని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను సూచించారు.
ఈ మేరకు SIR పై ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. SIR కీలకమైన ప్రక్రియ అని, నిర్లక్ష్యం చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ SIR పురోగతిపై నివేదిక ఇచ్చారు. 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో పనితీరు బాగుందని, 42 నియోజకవర్గాల్లో సాధారణ స్థాయిలో ఉందని తెలిపారు. 21 స్థానాల్లో సరిగా పని చేయడం లేదని, అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహదూర్పూర్ — ఈ నాలుగు నియోజకవర్గాల్లో బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) అసలు పని చేయడం లేదని చెప్పారు. పనితీరు సరిగా లేని ఇంచార్జీలపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీలు కూడా SIR ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్ రేపు 10 మంది ఇంచార్జ్ మంత్రులతో అన్ని జిల్లాల్లో SIR పై సమీక్ష నిర్వహించనుంది. పార్టీ నేతల పనితీరుపై చర్చించి, మరిన్ని దిశా నిర్దేశాలు ఇవ్వనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com