నిరంతరం ఫోన్ వాడకం మెదడుకు హానికరం: నిపుణుల హెచ్చరిక
మానసిక ఒత్తిడి, చిరాకు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఎదురవుతున్నాయా? 8 గంటల నిద్ర, మంచి డైట్, ఎక్సర్‌సైజ్ చేసినా ఈ సమస్యలు తగ్గడం లేదా? అయితే మీ మెదడుకు నిరంతరం ఒత్తిడి కలుగుతోందని హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైకాలజీ నిపుణుల ప్రకారం, మెదడు నిరంతరం ఆలోచించడానికి లేదా పనిచేయడానికి రూపొందించబడలేదు. గతంలో ప్రజలు ఆఫీసు లేదా కాలేజీ నుంచి వచ్చిన తర్వాత టీ తాగడం, ధ్యానం చేయడం, కుటుంబంతో మాట్లాడడం, నేచర్‌ని చూడటం, వాకింగ్ చేయడం వంటి విరామాలు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం యువత నిద్ర లేవగానే నుంచి నిద్రపోయే వరకు, బాత్‌రూమ్‌లో కూడా యూట్యూబ్, ఫేస్‌బుక్ రీల్స్ చూస్తూ సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు.
ఈ నిరంతర డిజిటల్ వినియోగం మెదడును టార్చర్ చేసి మానసిక సమస్యలు, బ్రెయిన్ సంబంధిత జబ్బులకు దారితీస్తుందని నిపుణులు తెలిపారు. అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
దీనికి సరళమైన పరిష్కారంగా, రోజుకు కనీసం 5 నిమిషాలు ఫోన్, నోటిఫికేషన్లన్నీ ఆపేసి దూరంగా ఉంచాలని, వాకింగ్ చేయడం లేదా కిటికీ నుంచి నేచర్‌ని చూడటం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రవర్తన, లక్షణాల్లో క్రమంగా మార్పు వస్తుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com