ఖమ్మం: బిల్లు రాలేదని కాంట్రాక్టర్ స్కూలుకు తాళం
ఖమ్మం మండలం దానవాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరమ్మత్తు పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్, బిల్లు చెల్లించలేదని గురువారం పాఠశాల గేటుకు తాళం వేశారు.
ఆ కాంట్రాక్టర్ గతంలో పాఠశాలలో బాత్రూమ్లు, గదుల మరమ్మత్తులు, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ₹21 లక్షలు ఖర్చు చేసినట్లు, అందులో ₹16 లక్షలు తానే సొంతంగా పెట్టుబడి పెట్టానని, ₹10 లక్షలు ఇచ్చానని, మిగతా ₹6 లక్షలు ఇస్తే చాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్‌తో మాట్లాడి తాళం తీయించారు. చెల్లింపులపై స్పష్టత రావాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com