కృష్ణపట్నం పోర్ట్‌లో పైప్‌లైన్ పగిలి 100 టన్నలకు పైగా క్రూడ్ ఆయిల్ సముద్రంలోకి లీక్
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వద్ద పైప్లైన్ పగిలి క్రూడ్ ఆయిల్ సముద్రంలోకి లీకైంది. ఈ ఘటనలో 100 టన్నలకు పైగా క్రూడ్ ఆయిల్ సముద్రం పాలైంది.
పోర్టులోని రెండో నంబర్ బెర్త్ వద్ద ఓరియన్ ఛాలెంజ్ నౌక నుంచి క్రూడ్ ఆయిల్ ట్రాన్స్‌ఫర్ చేస్తుండగా పైప్లైన్ డ్యామేజి అయింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌక అర్జెంటీనా నుంచి 10 వేల టన్నల క్రూడ్ ఆయిల్ తీసుకొని కృష్ణపట్నం చేరుకుంది.
ప్రమాదానికి నిర్వహణ లోపం కారణమని ప్రాథమిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోర్ట్ యాజమాన్యం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. కాంట్రాక్టర్లు, సిబ్బంది, అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. విచారణ పూర్తయ్యాక నష్టం వివరాలు, ఖచ్చితమైన కారణాలు వెల్లడి చేస్తామని పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com