హైదరాబాద్‌లో 237 కేజీల గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్టు
హైదరాబాద్‌లో ఈగల్ పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు. ఎన్హెచ్-65పై వైఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో తనిఖీ చేపట్టగా, ఓ లారీలో 237 కేజీల గంజాయి లభ్యమైంది. దీని విలువ రూ.1.38 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. వాహనంలో ఉన్న రాజేష్ కుమార్, అనిల్ రంగనాథ్ బిచారి అనే ఇద్దరిని అరెస్టు చేశారు.
ఈ గంజాయి ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పుణెకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ రవాణాకు సహాయపడిన సురేష్ కేదారి (పుణె), ధరంశిండే (పుణె), పవిత్ర కుమార్ సబర్ (ఒడిశా) అనే ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు.
ఇదే ముఠాకు చెందిన కేసుల్లో ఇప్పటికే పలు గంజాయి సీజర్లు జరిగాయి. మే 16న రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు చౌటుప్పల్ టోల్‌ప్లాజా వద్ద 455 కేజీల గంజాయి పట్టుకున్నారు. మే 21న ఖమ్మం పోలీసులు 20-21 కేజీల గంజాయి సీజ్ చేశారు. జూన్ 12న మరో 202 కేజీల గంజాయి కూడా స్వాధీనం చేసినట్లు ఈగల్ విభాగం తెలిపింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com