డ్రగ్స్ వ్యతిరేక పోరుకు ఈగల్ విభాగం అనామక టిప్స్ ప్లాట్‌ఫాం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాల రవాణా, అమ్మకాలను అడ్డుకునేందుకు ఈగల్ విభాగం కొత్త వెబ్‌సైట్, అనామక సమాచార యాప్‌ను ప్రారంభించింది. పౌరులు తమ ప్రాంతంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే తమ వివరాలు వెల్లడించకుండా ఈ యాప్ ద్వారా సమాచారం పంపవచ్చు. పేరు, ఫోన్ నంబర్ ఇవ్వనవసరం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విద్యా సంస్థలు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. ఒడిశా నుంచి రైళ్లు, బస్సుల ద్వారా వచ్చే గంజాయిని నిలువరించేందుకు ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రెయిన్స్, ఆన్ బస్సెస్ మొదలైన కార్యకలాపాలు చేపడుతున్నారు. ఒడిశా ఏఎన్‌టీఎఫ్ తో అనుసంధానం చేసుకుని సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. బెంగళూరు, గోవా నుంచి వచ్చే సింథెటిక్ డ్రగ్స్‌పైనా నిఘా ఉంచి, 10, 15 గ్రాములను స్వాధీనం చేసుకుని బ్యాక్‌వర్డ్, ఫార్వర్డ్ లింక్‌ల ద్వారా ఇతర రాష్ట్రాల నిందితులను గుర్తించారు.
గత 11-12 ఏళ్లుగా 40 వేల మంది నిందితుల సమాచారంతో ఈగల్ విభాగం నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టం రూపొందించింది. జైలు నుంచి విడుదలైన వారిపై ప్రత్యేక నిఘా ఉంచి, మరోసారి మాదకద్రవ్యాల అమ్మకాలు చేస్తే పీడీ యాక్ట్ కింద ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నారు. ఇప్పటివరకు 127 మందిని ఈ విధంగా అదుపులోకి తీసుకున్నారు.
70 లక్షల మంది విద్యార్థుల భద్రత కోసం 'ఈగల్ 1972 డ్రగ్స్ వద్దు బ్రో', 'ఆపరేషన్ సేఫ్ క్యాంపస్' వంటి ప్రచారాలు నిర్వహిస్తున్నట్లు ఐజీ చెప్పారు. విద్యా సంస్థల చుట్టూ 500 మీటర్ల డ్రగ్ ఫ్రీ జోన్ గా గుర్తించి, ఆపరేషన్ వజ్ర ప్రహారం విస్తరించారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం కోసం ఈగల్ కాల్ సెంటర్ 197కి ఫోన్ చేయాలని కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com