ఈఎంఐ ఒక రోజు ఆలస్యమైతే CIBIL స్కోర్ పడిపోతుందా? వాస్తవాలు ఇవే
ప్రతి నెలా ఈఎంఐ కట్టే వారికి ఒక రోజు ఆలస్యం అంటే చాలా భయం. జీతం రాకపోవడం, ఎమర్జెన్సీ ఖర్చులు, చేతిలో నగదు లేకపోవడం వంటి కారణాలతో ఈఎంఐ గడువు మిస్ అవుతుంది. కానీ ఒక రోజు ఆలస్యంగా చెల్లిస్తే సిబిల్ స్కోర్ పడిపోతుందా అన్నది చాలా మంది ప్రశ్న.
సాధారణంగా బ్యాంకులు ఈఎంఐ వెంటనే క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయవు. చాలా సందర్భాల్లో 3 నుంచి 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఈ లోపు ఈఎంఐ చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఆలస్య రుసుములు, బౌన్సర్ చార్జీలు పడతాయి కానీ స్కోర్ ప్రభావం ఉండదు.
30 రోజులు దాటితేనే బ్యాంకు క్రెడిట్ బ్యూరోకు సమాచారం ఇస్తుంది. అప్పుడు సిబిల్ స్కోర్ 50 నుంచి 100 పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది శాశ్వత నష్టం కాదు. తర్వాత నుంచి ఈఎంఐలు క్రమం తప్పకుండా చెల్లిస్తే మళ్లీ స్కోర్ పెరుగుతుంది. బ్యాంకుతో సమస్యను పంచుకుని సమయం కోరడం కూడా మంచిది.
ఒక రోజు ఆలస్యం పెద్ద విషయం కాదు. కానీ అలాగే నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. సమయానికి చెల్లించడమే సులభం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com