రికార్డు హీట్ వేవ్స్; ఐరోపాలో 45°C ఉష్ణోగ్రతలు, వస్తువులు కరిగిపోతున్నాయి
ఐరోపాలో ఒక్కసారిగా తీవ్రమైన వడగాలులు (heat waves) కొంటసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ మించి నమోదవుతున్నాయి. సాధారణంగా 15 నుండి 16 డిగ్రీల చల్లని వాతావరణానికి అలవాటుపడిన ఐరోపాకు ఈ పరిస్థితి పూర్తిగా కొత్తగా మారింది.
ఈషేస్తున్న వేడికి అక్కడి వస్తువులు కరిగిపోతున్నాయి. ప్లాస్టిక్ డస్ట్ బిన్లు, ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు కరిగి ముద్దగా అవుతున్నాయి. రోడ్లపై తారు ద్రవంగా మారిపోతోంది. వాహనాల టైర్లు కూడా వేడికి కరిగి దారుణ పరిస్థితి నెలకొంది. ఎండలో చెప్పులు కరిగి కాళ్లకు అతుక్కుంటున్నాయి. బ్యాడ్మింటన్ ఆటకు ఉపయోగించే రాకెట్ హ్యాండిల్స్ సైతం కరిగి చేతులకు నలుపు రంగు అంటుకుంటోంది.
ఐరోపాలో చాలా ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ (AC) సదుపాయం లేదు. అక్కడ సాధారణంగా చల్లగా ఉండడంతో కూలర్లు, ఫ్యాన్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఈ పరిస్థితిలో ప్రజలు AC, కూలర్ల కొనుగోలు కోసం షాపుల ముందు గంటల తరబడి క్యూ కడుతున్నారు. వడగాలుల కారణంగా పాఠశాలలు, కళాశాలలు తాత్కాలికంగా మూసివేస్తున్నారు.
వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం రహదారులపై నీటి స్ప్రింకర్లను ఏర్పాటు చేసింది. ఈ వేడి ప్రభావంతో చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి తీవ్ర హీట్ వేవ్స్ ఏర్పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com