ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్

రాజమండ్రి కోటగుమ్మంలో బట్టల షాప్‌కు భారీ అగ్ని ప్రమాదం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రాజమండ్రి కోటగుమ్మంలో బట్టల షాప్‌కు భారీ అగ్ని ప్రమాదం
📷 KATRIN BOLOVTSOVA / Pexels
షేర్ కాపీ అయింది ✓

రాజమండ్రి కోటగుమ్మంలో ఒక బట్టల షాప్‌కు అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం షాప్ తెరిచిన వెంటనే AC ఆన్ చేయడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.

సిబ్బంది అప్రమత్తం అయ్యేలోపే పై రెండు అంతస్తులు కూడా తగలబడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే సిబ్బంది అందరూ బయటకు పరుగులు తీశారు.

ఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కన మరికొన్ని షాప్‌లు ఉండటంతో చుట్టుపక్కల వారిలో ఆందోళన నెలకొంది. మంటలు పక్కనున్న దుకాణాలకు వ్యాపిస్తాయేమోనని భయంగా ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com