యూట్యూబ్ చూసి 600 పాములు పట్టిన హర్యానా మహిళా పోలీస్
హర్యానాలోని పంచకుల జిల్లా పోలీస్ లైన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లోకేశ్ కుమారి అనే మహిళా పోలీస్ కు విష సర్పాలను పట్టడంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈమె ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండా, కేవలం యూట్యూబ్ వీడియోలను చూసి పాములను పట్టడం నేర్చుకున్నారు.
ఇటీవల స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో ఓ నల్లటి పాము కనిపించిందని సమాచారం అందగా, లోకేశ్ కుమారి రంగంలోకి దిగారు. దాదాపు గంటసేపు వెతికినా పాము కనిపించలేదు. దీంతో ఆమె పెట్రోల్ తెప్పించి బాత్రూమ్ పైపుల ప్రాంతంలో పిచికారి చేయగా, కొద్ది నిమిషాల్లోనే ఒక పెద్ద మగ తాచుపాము బయటకు వచ్చింది. లోకేశ్ కుమారి క్షణాల్లో దాన్ని సులువుగా పట్టుకొని, సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
ఆమె ఇప్పటివరకు 600కు పైగా వివిధ జాతుల సర్పాలను పట్టుకున్నట్లు సమాచారం. వివిధ జాతుల పాముల గురించి, వాటిని పట్టుకునే పద్ధతుల గురించి యూట్యూబ్ ద్వారా క్షుణ్నంగా నేర్చుకున్నట్లు లోకేశ్ కుమారి చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com