హైదరాబాద్ 29°C
అమరావతి 33°C
IST 4:35 PM
శనివారం ఆగస్టు 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ఇన్ఫ్లో.. 30 గేట్లు ఎత్తివేత

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ఇన్ఫ్లో.. 30 గేట్లు ఎత్తివేత
📷 Alotrobo / Pexels
షేర్ కాపీ అయింది ✓

మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2.26 లక్షల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 8 టీఎంసీలు కాగా, పూర్తి నీటి మట్టం 9.57 టీఎంసీలు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

అదే విధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 2.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 66,460 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 876.20 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. పూర్తి నిలువ సామర్థ్యం 215.80 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 169.46 టీఎంసీలు.

జూరాల నుండి వచ్చే వరద శ్రీశైలంకు చేరుతుండగా, కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com