రాజమండ్రిలో కుండపోత వర్షం.. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో
రాజమండ్రి నగరంలో సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
సుమారు 30 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. హైటెక్ బస్ స్టేషన్, వివేకానంద జంక్షన్, కోరుకొండ రోడ్డు వద్ద రోడ్లపై వరదనీరు భారీగా చేరింది. రైల్వే స్టేషన్ రోడ్డు ఇప్పటికీ నీటిలోనే ఉంది.
నీటిలో చిక్కుకున్న వాహనాలతో ట్రాఫిక్ అక్కడక్కడే నిలిచిపోయింది. కొన్ని కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత రెండు రోజులుగా తుఫాను ప్రభావంతో రాజమండ్రిలో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం కురిసిన భారీ వానకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగాయి. మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీలు తెరుస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com