వాతావరణం

హైదరాబాద్‌లో భారీ వర్ష హెచ్చరిక; సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు హై అలర్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో భారీ వర్ష హెచ్చరిక; సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు హై అలర్ట్
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

వాతావరణ శాఖ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

డీజీపీ సీవీ ఆనంద్ సైబరాబాద్ పరిధిలోని మల్కం చెరువు, బొటానికల్ గార్డెన్ ప్రాంతాల్లో పర్యటించారు. సైబరాబాద్ సీపీ రమేష్, సీఎంసీ కమిషనర్‌లు ముందస్తు చర్యల వివరాలు అందించారు. ట్రాఫిక్ నిలిచిపోయే పాయింట్ల కారణాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విభాగాలు జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా పనిచేయాలని సీవీ ఆనంద్ సూచించారు.

హైదరాబాద్ నగరంలో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ పర్యటించారు. రోడ్లపై వర్షపు నీరు త్వరగా డ్రైనేజీల ద్వారా మళ్లించాలని, మ్యాన్‌హోల్స్, విద్యుత్ స్తంభాల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరవాసులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన తెలిపారు.

మల్కాజగిరి సీపీ సుమతి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి బేగంపేట చీకోటి గార్డెన్, ఇతర వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలిసి పర్యటించారు. ట్రాఫిక్ అంతరాయల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సీపీ ఆదేశించారు.

రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ఎన్బీ అధికారులను అప్రమత్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉండాలని, రోడ్లు కోతకు గురైతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com