ఏపీ, తెలంగాణ ఏజెన్సీల్లో భారీ వర్షాలు.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్
తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెదబైలు మండలం రాయి మామిడి వద్ద పెద్ద గెడ్డవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. సిర్పూర్ మండలం చిలపల్లి వద్ద వరద నీటికి కాజ్వే పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. తక్షణమే తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
పెంచికల్పేట మండలంలోని కంబర్గాం, నందిగాం, మురళీగూడా, జై హిందూర్పూర్ తదితర గ్రామాల్లో రోడ్డు రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల వానకాలంలో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకోవడం కష్టంగా మారింది. తమ గ్రామాలకు శాశ్వత రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com