హైదరాబాద్ 25°C
అమరావతి 28°C
IST 10:10 AM
సోమవారం జూలై 27 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

తెలంగాణలో భారీ వర్షాలు: హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు జలమయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో భారీ వర్షాలు: హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు జలమయం
📷 Büşranur Aydın / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి.

సికింద్రాబాద్, ఉప్పల్, రామాంతపూర్, తార్నాక, మలక్పేట్, చార్మినార్, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచకొట్టింది. ఫలితంగా ప్రధాన రహదారులు వరదనీటితో నిండిపోయాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గంటపాటు కురిసిన వర్షానికి నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలకు వరదనీరు చేరింది. డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, బోధన్, రెంజల్ తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది.

ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com