హైదరాబాద్ 33°C
అమరావతి 36°C
IST 3:53 PM
శనివారం జూలై 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

బకాయిలు రాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు సర్జికల్ సామాగ్రి సరఫరా నిలిపివేత

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బకాయిలు రాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు సర్జికల్ సామాగ్రి సరఫరా నిలిపివేత
📷 Click Jeth / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు సర్జికల్ వైద్య సామాగ్రి సరఫరా నిలిచిపోయింది. ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లై అసోసియేష‌న్ బకాయి బిల్ల‌లు విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

2022 నుంచి సర్జికల్ బిల్లులు రావడం ఆగిపోయాయని అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్ర తెలిపారు. మొత్తం 14 త్రైమాసికాలకు బడ్జెట్ విడుదల కాగా, కేవలం రెండు త్రైమాసికాలకు మాత్రమే చెల్లింపు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా గత ఏడాది జనవరి నుంచి ఎలాంటి చెల్లింపులు రాలేదని ఆయన పేర్కొన్నారు.

వివిధ ఆసుపత్రుల్లో పెండింగ్ మొత్తాలు కోట్లలో ఉన్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో 4.5 కోట్లు, గాంధీలో 7.5 కోట్లు, నీలోఫర్‌లో 7 కోట్లు, సరోజినీ దేవిలో 1.5 కోట్ల రూపాయ‌ల బకాయిలు పేరుకుపోయాయి. మొత్తం టీజీఎంఎస్‌ఐడీసీలో 128 కోట్ల రూపాయ‌ల పెండింగ్ ఉందని చెప్పారు.

కార్డియాలజీ స్టెంట్లు, హార్ట్ వాల్వ్‌లు, ఆక్సిజనేటర్లు, యూరాలజీ డీజే స్టెంట్లు, కిడ్నీ విభాగంలో డయాలజర్లు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు, స్పైన్ ఇంప్లాంట్లు, సిరంజీలు, గ్లౌజ్‌లు తదితర సామగ్రి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని రామచంద్ర వివరించారు. చెల్లింపులు చేయాలని కోరుతూనే ఉన్నామని, అధికారులు మాత్రం బ్లాక్‌లిస్ట్ బెదిరింపులు చేస్తున్నారని ఆయన వాపోయారు. బకాయిలు క్లియర్ చేస్తే వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నుంచి ఈ విషయంపై ఇప్పటివరకు స్పందన లేదు. ఆసుపత్రుల్లో అత్యవసర సామగ్రి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి స్పందన రావాల్సి ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com