రష్యా వేదికపై హైదరాబాద్ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రియాంక ప్రదర్శన
హైదరాబాద్ కు చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ ప్రియాంక, రష్యాలోని దాగిస్తాన్ లో జరిగిన అంతర్జాతీయ కళా ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చారు. దాగిస్తాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నిర్వహించిన ఈ ఉత్సవానికి భారతదేశం నుంచి ఆమెకు ఆహ్వానం అందింది.
ఈ వేదికపై డాక్టర్ ప్రియాంక వరుసగా ఆరు కూచిపూడి నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఆధ్యాత్మిక భావరసాలు కూడిన ప్రదర్శనలతో భారతీయ నాట్య సంప్రదాయాన్ని ఆవిష్కరించారు. 22 దేశాల కళాకారులు, రష్యన్ ప్రేక్షకులు, అధికారులు సైతం ఆమె ప్రదర్శనలకు ముగ్ధులై ప్రశంసించారు.
అంతర్జాతీయ వేదికపై భారతీయ నాట్య వైభవానికి లభించిన ఈ గౌరవం తనకు మరపురానిదని డాక్టర్ ప్రియాంక తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com