అబిడ్స్‌లో డ్రగ్స్ నిఘా; పోలీసులపై కారు ఎక్కించిన సైఫ్ అరెస్ట్
హైదరాబాద్ అబిడ్స్‌లో డ్రగ్స్ కొనుగోలు సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులపై కారు ఎక్కించిన సైఫ్ అనే యువకుడిని అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్ న్యూ) కు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు జరుగుతుందని సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, సిబ్బంది అక్కడ నిఘా పెట్టారు. ఓ బ్లూ కలర్ బొలెరో కారు వచ్చి వ్యక్తి నుంచి ఒక ప్యాకెట్ తీసుకోవడం చూసిన పోలీసులు, ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కారులో ఉన్న హుసేని ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్‌ను పోలీసులు ఐడి కార్డులు చూపించి దిగాలని కోరగా, అతను కారును రివర్స్ చేశాడు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు మీదుగా కారు వెళ్లడంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
అనంతరం అఫ్జల్ గంజ్ వద్ద సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలు ఫ్రాక్చర్ అయిన మహేందర్ యాదవ్‌కు సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. సైఫ్‌పై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. డ్రగ్స్ సప్లై నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com