హైదరాబాద్ 28°C
అమరావతి 25°C
IST 2:50 PM
మంగళవారం నవంబర్ 3 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ బ్రేకింగ్

నల్గొండ IDL కంపెనీలో భారీ పేలుడు: నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నల్గొండ IDL కంపెనీలో భారీ పేలుడు: నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం గోపులపల్లిలోని IDL కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కంపెనీ భవనంలోని కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి.

ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం ముగ్గురు కార్మికులను హైదరాబాద్‌కు తరలించారు. మరో కార్మికుడు కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

గాయపడిన వారిలో ముగ్గురు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. నాలుగో వ్యక్తిని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందినవాడిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com