అక్రమ అండాల సేకరణపై రాష్ట్రవ్యాప్తంగా ART కేంద్రాల్లో తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అండాల సేకరణపై అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 44 ART కేంద్రాలను గుర్తించారు. ఇప్పటివరకు 22 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో ఏడు ఆసుపత్రుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించారు. ఏడు IVF సెంటర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 20 ఫెర్టిలిటీ కేంద్రాలకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు.
31 మంది నుంచి పదేపదే అండాలను సేకరించినట్టు గుర్తించారు. ఈ 31 మంది కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. వీరిలో చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు.
అండాల సేకరణలో నాలుగైదు గ్యాంగులు పనిచేస్తున్నట్టు సమాచారం. ఉద్యోగాల పేరుతో యువతను ప్రలోభపెట్టడం ఒక గ్యాంగ్ పని. హాస్టళ్ల పేరుతో మరో గ్యాంగ్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రుల ముసుగులో ఇంకో గ్యాంగ్, నకిలీ పత్రాలు సృష్టించే మరో గ్యాంగ్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
అంగీకార పత్రాలు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో చాలా వరకు నకిలీ పత్రాలని గుర్తించారు. పోలీసులతో పాటు 10 వైద్యశాఖ టాస్క్ ఫోర్స్ బృందాలు ఈ దందాపై దర్యాప్తు చేస్తున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com