ఆంధ్రప్రదేశ్

జొన్నగిరి బంగారు బిస్కెట్లు కర్నూలు మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జొన్నగిరి బంగారు బిస్కెట్లు కర్నూలు మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభం
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

జొన్నగిరి బంగారు గని నుండి ఉత్పత్తి అయిన తొలి బంగారు బిస్కెట్లు కర్నూలు మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 24 క్యారెట్‌ల నాణ్యమైన బంగారంతో 500, 100 గ్రాముల బిస్కెట్లు రూపొందించారు.

ప్రతి బంగారు బిస్కెట్‌పై ఆంధ్రప్రదేశ్ మ్యాప్, ‘ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ హెరిటేజ్ న్యూ ఎరా’ అనే అక్షరాలు ముద్రించారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలో వ్యాపారులు ‘మన ఇంటికి మన బంగారం’ పేరుతో ఈ బిస్కెట్లను విక్రయిస్తున్నారు.

జియో మైసూర్ సంస్థ నిర్వహించే జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 24న ప్రారంభించారు. స్థానిక జిల్లాలోనే ఉత్పత్తైన బంగారం లభ్యమవడం సంతోషకరమని, భవిష్యత్తులో ‘మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్’గా పేరొందుతుందని వ్యాపారులు భావిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com