హైదరాబాద్ 25°C
అమరావతి 31°C
IST 7:44 AM
గురువారం జూలై 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

నేడు తెలంగాణ పర్యటనకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నేడు తెలంగాణ పర్యటనకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాక
📷 Family medicine India / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 10:55కి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బీబీ నగర్‌లోని ఎయిమ్స్‌కు వెళ్తారు.

ఎయిమ్స్ సమీక్షా సమావేశం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు నిర్వహిస్తారు. 2:45కి ఎయిమ్స్ నుంచి బయలుదేరి 3:30కి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం ఉంటుంది.

సాయంత్రం 5:10కి తాజ్ డెక్కన్‌కు వెళ్లి, అక్కడ సాయంత్రం 5:30 నుంచి 7 వరకు మేధావులతో సమావేశం అవుతారు. రాత్రి 7:10కి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, 9 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com