కార్టూనిస్ట్ శంకర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న కేటీఆర్
కార్టూనిస్ట్ శంకర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం. నారు, ఆర్టిస్ట్ విభాగంలో చిత్రకారుడు కూరెల్ల శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు. కేటీఆర్ వారికి అవార్డులను ప్రదానం చేశారు.
రాజకీయ విమర్శలకు దూరంగా ఇలాంటి సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని కేటీఆర్ అన్నారు. కళాకారులు, రచయితలతో కలిసే అవకాశం అరుదుగా లభిస్తుందని, ఇలాంటి సందర్భాలు పాత జ్ఞాపకాలను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేస్తాయని ఆయన తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com