తిరుపతి ఉపాధ్యాయ నగర్‌లో మళ్లీ చిరుత సంచారం; స్థానికులు భయాందోళన
తిరుపతి శివారులోని ఉపాధ్యాయ నగర్ ప్రాంతంలో చిరుత మళ్లీ కనిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గత నెల రోజుల్లో ఈ ప్రాంతంలో చిరుత ఏడు నుంచి ఎనిమిది సార్లు సంచరించిందని, ఇక్కడి నుంచి కపల తీర్థం, జూ పార్క్, కరకంపాడి వరకు దాదాపు వెయ్యి నుంచి 1500 నివాస గృహాలు ఉన్నాయని స్థానిక ప్రతినిధి గోపీనాథ్ తెలిపారు. రెండు మూడు రోజుల క్రితం ఉపాధ్యాయ నగర్‌లో సీసీ కెమెరాల్లో కూడా చిరుత రికార్డయింది.
అటవి అధికారులు సమాచారం అందుకున్న తర్వాత గస్తీని పెంచి, ట్రాప్ కెమెరాలు అమర్చారు. అయినా చిరుత సంచారం కొనసాగుతోంది. స్థానికులు సాయంత్రం చీకటి పడితే బయటకు రాలేకపోతున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు చిరుతను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేయాలని, పట్టుకున్న తర్వాత దూర ప్రాంతాల్లో వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఇవాళ బోన్లు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com