మహబూబాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై సంయుక్త తనిఖీలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
అధికారులు స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లను విడివిడిగా పరిశీలించారు. వైద్య పరీక్షల రికార్డులు, CCTV కెమెరాల ఫుటేజీని తనిఖీ చేశారు.
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే, భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తిలో మహబూబాబాద్ జిల్లా 15వ స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనుమానం ఉన్న ఒక ఆసుపత్రిపై కలెక్టర్ ఆదేశాల మేరకు, ఎస్పీ సహకారంతో అకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో ప్రతి పేషెంట్, ప్రతి బెడ్‌ను పరిశీలించారు. తమకు అందిన సమాచారం ప్రకారం ఆధారాలు దొరకలేదని అధికారులు తెలిపారు.
PC-PNDT Act కింద ఆసుపత్రికి నోటీసు జారీ చేశారు. గత వారం రోజుల్లో చికిత్స పొందిన పేషెంట్ల వివరాలు, అమ్మిన మందులు, పేషెంట్లు వచ్చిన ప్రాంతాలు, CCTV ఫుటేజీ రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు.
సమర్పించిన రికార్డులు, ఫుటేజీని వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు కలిసి పరిశీలిస్తారు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగినట్టు నిర్ధారణ అయితే ఆసుపత్రిని సీల్ చేస్తామని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com