హైదరాబాద్ 31°C
అమరావతి 31°C
IST 3:39 PM
గురువారం అక్టోబర్ 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వార్తలు

ఇల్లందులో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి మంచి నీరు వృధా

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఇల్లందులో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి మంచి నీరు వృధా
📷 Varun Gaba / Pexels
షేర్ కాపీ అయింది ✓

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి మంచి నీరు వృధా అవుతోంది. నిన్న రాత్రి 11 గంటలకు ఇల్లందు పట్టణంలోని 18వ వార్డ్ లో SBI బ్యాంక్ వద్ద పైప్లైన్ పగిలింది. దీంతో SBI ATM తో పాటు పలు దుకాణాల్లోకి నీళ్లు చేరి వస్తువులు తడిచి ముద్దయ్యాయి. షాపుల్లోని సరుకులన్నీ నీటి పాలవ్వడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీపావళి పండక్కి తెచ్చిన సరుకు మొత్తం తడిసిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. గత రెండేళ్లలో ఇదే పైప్లైన్ నాలుగుసార్లు డామేజ్ అయిందని, అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. ఈసారి ఉస్మతి హాస్పిటల్ వద్ద, మార్కెట్ లో కూడా ఇదే పైప్లైన్ పగిలిన సంఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు. రాత్రంతా నీళ్లు పారిపోవడంతో ప్రజలెవరికీ నిద్ర లేకుండా పోయిందని స్థానికులు చెప్పారు. అధికారులు వెంటనే పగిలిన పైప్లైన్ మరమత్తులు చేపట్టాలని, ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com