ముంబైలో భవనంలో అగ్ని ప్రమాదం: చిన్నారి, మహిళ మృతి, ఆరుగురికి గాయాలు
ముంబై పశ్చిమ శివారులోని విలే పార్లే వెస్ట్‌లో ఓ 12 అంతస్తుల భవనంలో రాత్రి భారి అగ్ని ప్రమాదం జరిగింది.
11వ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భవనం నుంచి నలుగురిని రక్షించారు.
ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, ఒక మహిళ మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్ని ప్రమాదం వల్ల భవనంలోని AC యూనిట్‌లో ఉన్న వస్తువులు కాలిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com