ఆంధ్రప్రదేశ్

కోల్‌కతాలో మంత్రి నారా లోకేశ్: విక్రమ్ సోలార్, హిమాద్రి కెమికల్‌స్‌తో పెట్టుబడులపై చర్చ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కోల్‌కతాలో మంత్రి నారా లోకేశ్: విక్రమ్ సోలార్, హిమాద్రి కెమికల్‌స్‌తో పెట్టుబడులపై చర్చ
📷 Ntrtrust / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విక్రమ్ సోలార్ సంస్థ సీఈఓ అరుణ్ మిట్టల్, ఎండీ జ్ఞానేశ్ చౌదరిలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఏపీ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించిన మంత్రి లోకేశ్, విక్రమ్ సోలార్ పవర్ హౌస్ స్టోరేజ్ విస్తరణ, ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీని గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించిందని, రాబోయే ఐదేళ్లలో 78.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకునే ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు.

అనంతరం, మంత్రి లోకేశ్ హిమాద్రి కెమికల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ చౌదరిని కలిశారు. నెల్లూరు లేదా చిత్తూరు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లలో హిమాద్రి ఫాస్ట్ క్లీన్ టెక్ లేదా సిలికాన్ కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతిలో ఐఐటి తిరుపతి లేదా ఆంధ్ర యూనివర్సిటీ భాగస్వామ్యంతో అధునాతన మెటీరియల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని, విశాఖపట్నంలో స్పెషాలిటీ బ్లాక్ కార్బన్ ఉత్పత్తి యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో ఇప్పటికే హిమాద్రి ప్రాంతీయ కేంద్రం ద్వారా పాలిమర్, రబ్బరు, పెయింట్ రంగాలకు సరఫరా చేస్తున్న సంగతిని గుర్తు చేశారు.

మంత్రి లోకేశ్ చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని హిమాద్రి సీఎండీ అనురాగ్ చౌదరి తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com