నేడు దేశవ్యాప్తంగా NEET UG 2026 రీ-ఎగ్జామ్; 22 లక్షల మంది హాజరు
NEET UG 2026 రీ-ఎగ్జామ్ నేడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. 551 నగరాల్లో, 5440 పరీక్షా కేంద్రాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కొనసాగుతుంది. 22 లక్షల 79 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది.
గతంలో మే 3న జరిగిన నీట్ పరీక్ష రాజస్థాన్లో పేపర్ లీక్ కావడంతో మే 12న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ లీకేజీపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పరీక్ష రద్దు నేపథ్యంలో ఐదుగురు విద్యార్థులు మరణించారు.
ఈసారి అత్యంత కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. దేశవ్యాప్తంగా 38,000 ఏఐ సీసీ కెమెరాలతో పరివేక్షణ చేస్తున్నారు. మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లతో విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, పెన్డ్రైవ్లు, స్మార్ట్వాచ్లు, పర్సులు, బంగారు ఆభరణాలను నిషేధించారు. వాటర్ బాటిళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు.
అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటలలోపు చేరుకోవాలని NTA సూచించింది. 1:30 తర్వాత ఎవరినీ కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. పేపర్ లీక్ తదితర సమస్యలు పునరావృతం కాకుండా ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు NTA వెల్లడించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com