NEET UG 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు NTA మాక్ డ్రిల్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేడు దేశవ్యాప్తంగా NEET UG 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించి భారీ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది.
ఈ మాక్ డ్రిల్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల్లో భద్రత ఏర్పాట్లు, బయోమెట్రిక్ ధృవీకరణ, CCTV నిఘా, ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
జూన్ 21న రీ-ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి 3 గంటల 15 నిమిషాల పరీక్షా వ్యవధి కేటాయించారు. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు.
గతంలో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా NTA కఠిన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రతి కేంద్రంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్, CCTV నిగా, ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది.
అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడితో నిర్ణీత సమయానికే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం నమ్మవద్దని NTA స్పష్టం చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com