తెలంగాణ

ఓయూలో జార్జిరెడ్డి పీడీఎస్యూ ర్యాలీ: 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్‌కు డిమాండ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఓయూలో జార్జిరెడ్డి పీడీఎస్యూ ర్యాలీ: 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్‌కు డిమాండ్
📷 Andy Barbour / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) లో జార్జి రెడ్డి పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జార్జి రెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను 5,000 నుంచి 20,000 వేలకు పెంచాలని, డీఎస్సీ నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని, అలాగే 2 లక్షల ఉద్యోగాల ప్రకటనకు సంబంధించిన ‘జంబో నోటిఫికేషన్’ ను వేగంగా రిలీజ్ చేయాలని మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినట్లు తెలిపారు.

ఫేక్ సర్టిఫికెట్లతో 2023లో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com