హైదరాబాద్ 30°C
అమరావతి 35°C
IST 4:44 PM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వరాలయంలో మహా జలాభిషేకం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వరాలయంలో మహా జలాభిషేకం
📷 Anandhu Arjunan / Pexels
షేర్ కాపీ అయింది ✓

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వరాలయంలో శ్రావణమాసం సందర్భంగా మహా జలాభిషేకం నిర్వహించారు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరిగాయి.

విఘ్నేశ్వర పూజ, రక్షాబంధన పూజతో పాటు సర్వతోభద్ర మండపంలో 108 కలశాలతో మహాన్యాస పూజలు, రుద్రాభిషేకం వంటి పూజలను వేదపండితులు నిర్వహించారు.

108 కలశాలతో భక్తులు ప్రధాన కాలువ నుంచి జలాలను తీసుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈఓ శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ మీశాల రాము, మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com