పవన్ కళ్యాణ్ ఏరువాక పున్నమి సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏరువాక పున్నమి సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూమాత, పశు సంపదను ఆరాధించే ఈ పండుగ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజు రైతులు నేల తల్లికి పూజ చేసి సేద్యం ప్రారంభించడం ఆనవాయితీ అని చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మొదటి విడత పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న బీబీ జీరామ జీ పనుల్లో కూడా రైతులకు మేలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com