పిఠాపురంలో ప్రజా సమస్యల గ్రీవెన్స్‌లో 65 అర్జీలు స్వీకరించిన కలెక్టర్
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పాడా కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి 65 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత వారం వచ్చిన 100 అర్జీల్లో ఇప్పటికే 15 సమస్యలు పరిష్కరించామని, మిగతా వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ రోజు అందిన అర్జీల్లో ఎక్కువగా సర్వే ఎక్స్టెంట్ వేరియేషన్, నీటిపారుదల అవసరాలు వంటి సమస్యలు ఉన్నాయి. కలెక్టర్ సంయుక్త శాఖల అధికారులను సమన్వయంతో ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అదే విధంగా పాడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని పనులు టెండర్ స్థాయిలో ఉండగా, మరికొన్ని శంక్షన్స్ పొందాయని, త్వరలోనే అన్ని పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com