ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలంలో నాగలి దున్నిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా కోహిలడ మండలం కూరెల్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి పొలంలో నాగలి దున్నారు. విత్తనాలు చల్లి వ్యవసాయ పనులను ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతోపాటు నీటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి, రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భూమాతను ప్రార్థించారు. ఏరువాక పౌర్ణమి రోజున అన్ని గ్రామాల్లోని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏటా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు నాగలి దున్ని, గోమాత పూజ చేసి పంటలు ప్రారంభించడం సంప్రదాయంగా ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com