హైదరాబాద్ 24°C
అమరావతి 30°C
IST 12:03 AM
ఆదివారం ఆగస్టు 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

పూరి రథయాత్ర తేదీల వివాదం: రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాసిన దేవ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పూరి రథయాత్ర తేదీల వివాదం: రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాసిన దేవ్
📷 Kamakshi / Pexels
షేర్ కాపీ అయింది ✓

పూరి జగన్నాథ రథయాత్ర తేదీలపై పూరి జగన్నాథ ఆలయ నిర్వహణ కమిటీ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ISKCON) మధ్య వివాదం రేగింది.

ఆషాడ శుద్ధ విధియనాడే రథయాత్ర నిర్వహించాలని, ఇతర తేదీల్లో నిర్వహించడం శాస్త్ర విరుద్ధమని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.

ఐతే వాతావరణం, రవాణా ఇబ్బందుల కారణంగా విదేశాల్లో వేర్వేరు తేదీల్లో యాత్రలు నిర్వహించాల్సి వస్తోందని ISKCON చెప్పింది. భారతదేశంలో మాత్రం పూరి సాంప్రదాయాన్ని పూర్తిగా పాటిస్తామని స్పష్టం చేసింది.

ఏటా ISKCON ప్రపంచవ్యాప్తంగా 600 రథయాత్రలు నిర్వహిస్తుండగా, వాటిలో 247 మాత్రమే శాస్త్రోక్తమైన 9 రోజుల వ్యవధిలో జరుగుతున్నాయని, 350కి పైగా యాత్రలు ఇతర తేదీల్లో జరుగుతున్నాయని ఆలయ కమిటీ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో శ్రీ జగన్నాథ టెంపుల్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు, గజపతి మహారాజ దివ్యసింగదేవ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. శాస్త్ర విరుద్ధంగా జరుగుతున్న రథయాత్రలను నిలిపివేయాలని ఆయన కోరారు.

స్కంద పురాణం, నారద పురాణాల ప్రకారం రథయాత్ర సమయాన్ని స్వయంగా జగన్నాథుడే నిర్ణయించాడని, తేదీల్లో మార్పు వల్ల ఉత్సవాల పవిత్రత దెబ్బతింటుందని పూరి పండితులు చెబుతున్నారు. ISKCON వాదనలను ఉన్నత స్థాయి సమావేశంలో వారు తిరస్కరించారు.

ఈ వివాదంపై ISKCON వివిధ సంప్రదాయాల మధ్య సమన్వయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com