తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది; టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కూడా భారీగా భక్తులు రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి, క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించింది. రద్దీ అధికంగా ఉండటంతో కొత్తగా వచ్చే భక్తులను క్యూ లైన్లోకి అనుమతించడం లేదు. కంపార్ట్మెంట్లు ఖాళీ అయిన తర్వాతే తాత్కాలికంగా అనుమతిస్తున్నారు.
సోమవారం 76 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, మంగళ, బుధవారాల్లో 75 వేల మంది దర్శించుకునే అవకాశం ఉందని TTD అధికారులు తెలిపారు. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు చెప్పారు.
రద్దీ నియంత్రణకు మరో మార్గం లేదని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని TTD అధికారులు వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com